TG:గురుకుల విద్యార్థులకు సమ్మర్ కోచింగ్ క్యాంప్ ప్రారంభం..

April 27, 2026 12:16 PM

Nalgonda జిల్లాలో గురుకుల విద్యార్థుల కోసం సమ్మర్ కోచింగ్ క్యాంప్ ప్రారంభమైంది. మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల విద్యాసంస్థల ఆధ్వర్యంలో కనగల్‌లోని బాలుర గురుకుల పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్‌తో కలిసి కార్యదర్శి బి. సైదులు ప్రారంభించారు.

ఈ సందర్భంగా సైదులు మాట్లాడుతూ, విద్యార్థులు చదువుతో పాటు వృత్తి నైపుణ్యాలలో కూడా ప్రావీణ్యం సాధించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ‘ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక’లో భాగంగా ఈ సమ్మర్ క్యాంప్‌ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఏప్రిల్ 24 నుంచి మే 8 వరకు కొనసాగనున్న ఈ శిక్షణలో క్రాఫ్ట్స్, గేమ్స్, స్పోర్ట్స్, కంప్యూటర్ ట్రైనింగ్, స్పోకెన్ ఇంగ్లీష్ వంటి విభాగాల్లో విద్యార్థులకు శిక్షణ అందిస్తున్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ ప్రతిభను నిరూపించుకోవాలని అధికారులు కోరారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media