Hyderabadలో మరో భారీ కల్తీ దందా బయటపడింది. H-FAST పోలీసుల సీక్రెట్ ఆపరేషన్‌లో సుమారు 4 టన్నుల కల్తీ టీ పౌడర్‌కు సంబంధించిన పదార్థాలను అధికారులు గుర్తించారు.

పరిశీలనలో భాగంగా వాడిన టీ పౌడర్‌కు రంగులు కలిపి మళ్లీ వినియోగిస్తున్నట్లు కొంతమంది టీ షాప్ యజమానులు చేస్తున్న అక్రమ కార్యకలాపాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో 10 మంది నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.H-FAST విభాగం ఏర్పడిన తర్వాత నగరంలో వరుసగా కల్తీ దందాలు బయటపడుతున్నాయి. ఇటీవలే 14 టన్నుల కల్తీ మటన్ కేసు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో, తాజా టీ పౌడర్ ఘటన మరింత కలకలం రేపుతోంది.అధికారులు ప్రజలకు హెచ్చరిక జారీ చేస్తూ, ఆహార పదార్థాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
