TG:హైదరాబాద్ ఆటోవాలా నిజాయితీకి సెల్యూట్…

April 24, 2026 10:47 AM

Hyderabadలో సైఫాబాద్ పోలీసులు వేగంగా స్పందించి ఆటోలో మర్చిపోయిన బంగారం, నగదును గంటలోనే రికవరీ చేశారు. కర్ణాటకకు చెందిన సుజాత హిరేమఠ్ అనే మహిళ నార్సింగి నుంచి బిర్లా మందిర్ వరకు ఉబెర్ ఆటోలో ప్రయాణించిన తర్వాత తన బ్యాగ్ ఆటోలోనే మర్చిపోయినట్లు ఫిర్యాదు చేశారు.

ఆ బ్యాగులో సుమారు 6.5 తులాల బంగారు ఆభరణాలు, రూ.3,500 నగదు ఉన్నట్లు తెలిపారు. ఈ మేరకు A. Seethaiah ఆదేశాలపై పోలీసులు సీసీటీవీ ఫుటేజీ పరిశీలించి, గంటలోపే ఆటోను గుర్తించారు.ఖైరతాబాద్‌కు చెందిన ఆటో డ్రైవర్ K. Nagesh తన వాహనంలో బ్యాగ్ సురక్షితంగా ఉన్నట్లు తెలిపి, వెంటనే పోలీస్ స్టేషన్‌కు వచ్చి బంగారం, నగదును అప్పగించాడు. అనంతరం ఆస్తిని ఫిర్యాదుదారుకు అందజేశారు.డ్రైవర్ నిజాయితీని పోలీసులు ప్రశంసిస్తూ నగదు బహుమతిని అందజేశారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media