హైదరాబాద్: హైదరాబాద్ అనగానే మనకందరికీ గుర్తొచ్చేది ఏంటి? అదిరిపోయే బిర్యానీ, ఘాటుగా ఉండే హలీమ్, నోరూరించే ఇరానీ చాయ్.. కదూ? కానీ, ఇప్పుడు నేను చెప్పబోయే విషయం వింటే మాత్రం మీ మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం. మనం అంత ఇష్టంగా తినే హైదరాబాద్ హోటళ్ల ఫుడ్ సేఫ్టీ ముచ్చట ఇప్పుడు దేశంలోనే అత్యంత దారుణమైన పొజిషన్లో ఉందట. అవును, నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం.
ఆహార భద్రతను పర్యవేక్షించే FSSAI (ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా) రీసెంట్గా ఇచ్చిన డేటా చూస్తే.. దేశంలోని అన్ని మెట్రో సిటీస్ కంటే మన హైదరాబాద్‌లోనే ఫుడ్ హైజీన్ మెయింటెనెన్స్ చాలా ఘోరంగా ఉందట.
75 వేల హోటళ్లు, 361 సర్టిఫికెట్లు!
ఒక్కసారి లెక్కలు చూస్తే… మన హైదరాబాద్ మొత్తంలో చిన్న, పెద్ద అన్నీ కలిపి దాదాపు 75,000 ఫుడ్ జాయింట్స్ ఉంటే.. అందులో కేవలం 25,000 హోటళ్లకు మాత్రమే లైసెన్సులు ఉన్నాయి.
ఇక అసలు ట్విస్ట్ ఏంటంటే.. ఈ లైసెన్స్ ఉన్న 25 వేల హోటళ్లలో, కేవలం 361 హోటళ్లు మాత్రమే ఫుడ్ సేఫ్టీ హైజీన్ రేటింగ్ సర్టిఫికెట్ తీసుకున్నాయి.
అంటే పట్టుమని 2 శాతం కూడా లేవు. మిగతా హోటళ్లలో కిచెన్ కండిషన్ ఎలా ఉందో ఊహించుకుంటేనే ఒళ్లు గగుర్పొడుస్తోంది కదూ?
కిచెన్ వెనుక అసలు భాగోతం!
ఈ మధ్యే అధికారులు ‘సెవెన్ సిస్టర్స్’ (Seven Sisters) అనే ఫేమస్ రెస్టారెంట్లో రైడ్ చేస్తే.. అక్కడ పగిలిపోయిన టైల్స్, కిచెన్‌లో బల్లి విసర్జితాలు (Lizard Droppings) దొరికాయట. అంత పెద్ద హోటళ్లలోనే అలా ఉంటే, ఇక నార్మల్ హోటళ్ల పరిస్థితి ఏంటి?
అయితే అందరూ అలానే లేరు లెండి.. రీసెంట్గా కొండాపూర్‌లోని ఒక బిర్యానీ అవుట్లెట్ మాత్రం ఫుడ్ సేఫ్టీ టెస్టుల్లో ఏకంగా 92% స్కోర్ సాధించి టాప్‌లో నిలిచింది.
కాబట్టి అందరినీ బ్లేమ్ చేయలేం, కానీ మెజారిటీ హోటళ్లు మాత్రం లైట్ తీసుకుంటున్నాయి.
మరి ఈ రేటింగ్స్ ఎందుకు పెరగట్లేదని GHMC ఫుడ్ సేఫ్టీ అధికారులను అడిగితే.. వాళ్లు పాపం చేతులెత్తేస్తున్నారు. “మేము తనిఖీలకు వెళ్లినప్పుడల్లా..
హైజీన్ రేటింగ్స్ తీసుకోండి, కస్టమర్ల నమ్మకం పెరుగుతుంది అని బతిమిలాడుతున్నాం.
కానీ హోటల్ ఓనర్లకు అస్సలు ఇంట్రెస్ట్ లేదు” అని వాపోతున్నారు. ప్రభుత్వం ఈ రూల్‌ను కచ్చితం (Mandatory) చేయకపోవడమే వీళ్ల నిర్లక్ష్యానికి కారణం.
ఇకనైనా మారాలి..
ఈ పరిస్థితి మారాలని ఇప్పుడు నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (NRAI) ఒక కొత్త ప్లాన్ తెస్తోంది.
ప్రతి ఏరియాలో అధికారులు, పబ్లిక్, హోటల్ అసోసియేషన్ మెంబర్స్‌తో కలిపి ఒక ‘మానిటరింగ్ కమిటీ’ వేయాలని GHMC కి రికమండ్ చేశారు.
వీళ్లు ఊరూరా తిరిగి ఏ ఏ హోటల్లో హైజీన్ లేదు, ఎక్కడ రేటింగ్స్ లేవో చెక్ చేసి పట్టుకుంటారట.
Also read



