జిసిసిల గమ్యస్థానంగా హైదరాబాద్: మంత్రి శ్రీధర్ బాబు

April 11, 2026 5:56 PM

హైదరాబాద్: ప్రపంచంలోని దిగ్గజ ఫైనాన్స్ సంస్థలన్నీ తమ గ్లోబల్ సామర్థ్య కేంద్రాల(GCC) ఏర్పాటుకు హైదరాబాద్ నగరాన్ని గమ్యస్థానంగా ఎంచుకున్నాయని ఐటి, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. నైపుణ్యాలతో కూడిన టేలెంట్ పూల్, అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలు, ట్రాఫిక్ సమస్య లేని రోడ్లు, అందుబాటులో ఉండే అద్దెలు ప్రముఖ కంపెనీలని ఆకర్షిస్తున్నాయని ఆయన తెలిపారు. న్యూయార్స్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే పికో టెక్నాలజి (PICO Technology) సంస్థప్రతినిధులు శనివారం నాడు బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో శ్రీధర్ బాబుతో భేటీ అయ్యారు. రోడ్లు, భవనాల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా సమావేశంలో పాల్గొన్నారు.

ఫైనాన్సియల్ మార్కెట్ కు సంబంధించిన సేవలు అందించే పికో టెక్నోలజీ సంస్థ పికో టెక్నాలజీ ఇండియా అనే అనుబంధ కంపెనీ ద్వారా ఇక్కడ జిసిసి ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. ఈ సంసర్భంగా శ్రీధర్ బాబు వారికి ఇక్కడి అవకాశాలు, మౌలిక వసతుల గురించి వివరించారు. రానున్న 5-10 సంవత్సరాలు, తర్వాత 20 సంవత్సరాల అవసరాలకు తగిన విధంగా మౌలిక సదుపాయాలు మెరుగు పర్చేందుకు ప్రణాళికలు అమలు చేస్తున్నట్టు ఆయన తెలిపారు. బెంగళూరు, ముంబాయి నగరాలతో పోలిస్తే ఇక్కడ ఆఫీసు స్థలాల ఆక్యుపెన్సీ 73 శాతం ఉందని చెప్పారు. ముంబాయిలో అది 52 శాతం మాత్రమేనని తెలిపారు. బెంగళూరు, ముంబాయి మెట్రో నగరాల్లో ట్రాఫిక్, వాయు కాలుష్యం ప్రధాన సమస్యలుగా మారినందున ఐటి సంస్థలు, జిసిసిలు హైదరాబాద్ కు తరలి వస్తున్నాయని తెలిపారు.

ఇప్పుడున్న నెహ్రూ రింగ్ రోడ్డుకు 30 కిలో వెలుపల రీజనల్ రింగ్ రోడ్డు నిర్మిస్తున్నట్టు ఆర్ అండ్ బి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు. దానికి అనుబంధంగా రేడియల్ రోడ్లు ఏర్పాటవుతున్నాయిని వివరించారు.రింగ్ రోడ్ల పక్కన రైలు మార్గాన్ని కూడా ఏర్పాటు చేసి రవాణా సదుపాయాలను ప్రపంచంలోని పెద్ద నగరాలను తలదన్నేలా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. హయత్ నగర్- ఎల్బీనగర్ ల మధ్య డబుల్ డెక్కర్ రోడ్డు నిర్మిస్తున్నాట్టు వివరించారు. కింది రోడ్డు స్థానిక ట్రాఫిక్ అవసరాలకు వినియోగిస్తామని పైన ఉండే రెండు అండు అంతస్థుల రోడ్లు నగరం నుంచి వెలుపలకు, లోపలకి వచ్చే వాహనాల కోసం ప్రత్యేకిస్తామని చెప్పారు. నాగపూర్ తర్వాత డబుల్ డెక్కరో రోడ్లు నిర్మిస్తున్న నగరం ఇదేనని అన్నారు. రెండు నెలల్లో టెండర్ ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభిస్తామని చెప్పారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media