హైదరాబాద్‌ మదీనా ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం

May 21, 2026 3:03 PM

హైదరాబాద్‌ మదీనా ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఎస్‌వైజే కాంప్లెక్స్‌లో ఒక్కసారిగా మంటలు ఎగసిపడటంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. పలువురు అక్కడి నుంచి పరుగులు తీశారు.

మంటలను గుర్తించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం ఇచ్చారు. ప్రమాదంలో మూడు దుకాణాలకు మంటలు వ్యాపించాయి. అయితే అగ్నిప్రమాదానికి గల కారణం ఇంకా తెలియరాలేదు.

సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక శాఖకు చెందిన ఎనిమిది ఫైర్‌ ఇంజిన్లు ఘటనాస్థలికి చేరుకున్నాయి. ఫైర్‌ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే ఎగిసిపడుతున్న మంటల వల్ల సహాయక చర్యలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

మంటలు చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించకుండా అధికారులు చర్యలు చేపట్టారు. ప్రమాదం జరిగిన కాంప్లెక్స్‌లో వందకు పైగా దుకాణాలు ఉండటంతో వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media