హైదరాబాద్‌లో అత్యవసర ల్యాండింగ్

May 30, 2026 3:01 PM
IndiGo flight after emergency landing at Hyderabad RGIA following technical issue

హైదరాబాద్, మే 30: బెంగళూరు నుంచి నాగ్‌పూర్‌కు వెళ్తున్న ఇండిగో విమానం శనివారం శంషాబాద్‌లోని Rajiv Gandhi International Airportలో అత్యవసరంగా దిగింది.

విమానంలో సాంకేతిక లోపం ఉన్నట్లు గుర్తించిన పైలట్ వెంటనే ఆర్జీఐఏ అధికారులకు సమాచారం ఇచ్చారు. అత్యవసర ల్యాండింగ్‌కు అధికారులు అనుమతి ఇచ్చారు.

ఆ సమయంలో విమానంలో 126 మంది ప్రయాణికులు ఉన్నారు. అనంతరం విమానం సురక్షితంగా దిగడంతో ప్రయాణికులు, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.

ఘటనపై అధికారులు అవసరమైన తనిఖీలు చేపట్టినట్లు సమాచారం.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media