TG:చౌటుప్పల్‌లో జనసేన వినూత్న నిరసన

March 3, 2026 4:58 PM

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో జనసేన పార్టీ కార్యకర్తలు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులను, అలాగే పహల్గాం ఉగ్రదాడి ఘటనను నిరసిస్తూ పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్, బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వ ముఖ్య సలహాదారు మహ్మద్ యూనస్ చిత్రపటాలపై కోడిగుడ్లు, టమాటాలు విసిరి కొట్టారు.

బంగ్లాదేశ్‌లో మైనారిటీ హిందువుల రక్షణ కరువైందని, నిరంతరం దాడులు జరుగుతున్నాయని జనసేన కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. హోలీ పండుగను పురస్కరించుకుని ఈ నిరసనను చేపట్టారు. దేశ సరిహద్దుల్లో అల్లకల్లోలం సృష్టిస్తున్న దేశాల వైఖరిని ఎండగట్టారు.పహల్గాం ప్రాంతంలో జరిగిన ఉగ్రవాద దాడుల వెనుక పాకిస్థాన్ హస్తం ఉందంటూ నవాజ్ షరీఫ్ చిత్రపటానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంతర్జాతీయ వేదికలపై హిందువుల భద్రత కోసం భారత ప్రభుత్వం మరిన్ని కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ జనసేన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ నిరసనను గళమెత్తారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media