AP:క్రికెట్ లెజెండ్ కపిల్ దేవ్‌తో గంటా భేటీ..

April 14, 2026 11:45 AM

భారత క్రికెట్ లెజెండ్ కపిల్ దేవ్తో భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా విశాఖపట్నం రావాలని గంటా ఆహ్వానించగా, త్వరలోనే తప్పకుండా సందర్శిస్తానని కపిల్ దేవ్ హామీ ఇచ్చారు. విశాఖ అంటే తనకు ఎంతో ఇష్టమని, అక్కడ గోల్ఫ్ కూడా ఆడాలని ఆసక్తి వ్యక్తం చేశారు.1983లో భారతదేశానికి తొలి వరల్డ్ కప్ అందించిన కపిల్ దేవ్, అప్పటి క్రికెట్ అనుభవాలు, నేటి తరం క్రికెట్ మధ్య తేడాలపై ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.అలాగే రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను గంటా ఆయనకు వివరించారు.విశాఖను “సిటీ ఆఫ్ డెస్టినీ”గా అభివృద్ధి చేస్తున్న నేపథ్యంలో అక్కడ పర్యటన కోసం ఎదురుచూస్తున్నానని కపిల్ దేవ్ తెలిపారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media