తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు (కేసీఆర్) 72వ జన్మదిన వేడుకలు శేరిలింగంపల్లి నియోజకవర్గంలో మిన్నంటాయి. రాష్ట్ర నాయకుడు మారబోయిన రవి యాదవ్ ఆధ్వర్యంలో మస్జిద్ బండ కట్ట మైసమ్మ వద్ద 72 అడుగుల కేసీఆర్ భారీ చిత్రాన్ని పచ్చికపై అద్భుతంగా ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమానికి కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేశారు. కేసీఆర్ నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. జై తెలంగాణ నినాదాల మధ్య జరిగిన ఈ వేడుకల్లో మాజీ కార్పొరేటర్లు కొమటి సాయి బాబా, నవత రెడ్డి మరియు భారీ సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక కేసీఆర్ అని, ఆయన నాయకత్వం రాష్ట్రానికి దిశానిర్దేశమని రవి యాదవ్ పేర్కొన్నారు.

