INTER బాలిక”కీర్తన”హత్య కేసులో BIG ట్విస్ట్..!!

April 13, 2026 11:31 AM

అగ్రహారంలో ఇటీవల జరిగిన ఇంటర్ విద్యార్థిని కీర్తన హత్య కేసులో కొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో నిందితుడు వెంకటేష్ తల్లి సుజాత మీడియా ముందుకు వచ్చి సంచలన వ్యాఖ్యలు చేశారు.

తన కొడుకు మరియు కీర్తన మధ్య ప్రేమ సంబంధం ఉన్న విషయం ముందుగా తెలియదని, ఒక లేఖ ద్వారా మాత్రమే తెలిసిందని ఆమె పేర్కొన్నారు. హత్య జరిగిన రోజు ఇంటికి వచ్చి తన కుమారుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ, ప్రేమ విషయంలో వివాదం జరిగినట్లు చెప్పాడని తెలిపారు.ఈ ఘటనలో జరిగిన పెనుగులాటలో కీర్తనకు గాయమైందని తన కుమారుడు చెప్పాడని, తరువాత ఏమైందో తెలియక భయంతో ఇంటికి వచ్చాడని వెల్లడించారు.తన కుమారుడు అమాయకుడని, అయితే చట్టం ప్రకారం విచారణ జరిపి శిక్ష విధించాలని కోరారు. తాను ఒంటరి మహిళనని, తన కుమారుడికి అన్యాయం జరగకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.ఈ కేసు ప్రస్తుతం మరింత కీలక దశకు చేరుకోగా, పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media