రైతుల భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం “కిసాన్ మిత్ర ఛడి” అనే స్మార్ట్ పరికరాన్ని పరిచయం చేసింది. Shivraj Singh Chouhan ఈ డివైస్‌ను జాతీయ వ్యవసాయ ప్రదర్శనలో ఆవిష్కరించారు.
ఈ పరికరం బయటకు సాధారణ స్టిక్‌లా కనిపించినా, లోపల అధునాతన సెన్సార్ టెక్నాలజీతో రూపొందించబడింది. దీన్ని యాక్టివేట్ చేసిన వెంటనే 100 మీటర్ల పరిధిలో ఉన్న పాములు మరియు ఇతర విషపూరిత జీవులను గుర్తించగలదు.డేంజర్ దగ్గర్లో ఉన్నప్పుడు ఈ డివైస్ గట్టిగా అలారం ఇవ్వకుండా, వైబ్రేషన్ల ద్వారా యూజర్‌కు అలర్ట్ ఇస్తుంది. దీంతో రైతులు ముందుగానే అప్రమత్తమై ప్రమాదాన్ని తప్పించుకోవచ్చు.ప్రత్యేకంగా రాత్రి సమయంలో పొలాల్లో పని చేసే రైతులకు ఈ పరికరం ఎంతో ఉపయోగకరంగా ఉండనుంది. ప్రమాదం జరిగే ముందు హెచ్చరిక ఇచ్చే స్మార్ట్ ప్రివెన్షన్ టూల్‌గా ఇది వ్యవసాయ రంగంలో చర్చనీయాంశంగా మారింది.
