కేరళం ప్రచారంలో సీఎం రేవంత్ తప్పుడు ఆరోపణలు: కిషన్ రెడ్డి
తెలంగాణ : కేరళం ప్రచారంలో సీఎం రేవంత్ బీజేపీపై తప్పుడు ఆరోపణలు చేశారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. బీసీలకు అన్యాయం చేశామని చెప్పుకుంటున్నారని, కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల హామీలతోనే ఎన్నికల్లో గెలిచిందన్నారు. తెలంగాణకు ఏం చేశారని కేరళంలో రేవంత్ ప్రచారం చేస్తున్నారని ప్రశ్నించారు. కేసీఆర్ చేసిన తరహాలోనే రేవంత్‌రెడ్డి కూడా ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు.
