ఆలమూరు (కొత్తపేట నియోజకవర్గం): రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధిని సమపాళ్లలో అందిస్తున్న కూటమి ప్రభుత్వంపై రోజురోజుకూ ప్రజాదరణ పెరుగుతోందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పేర్కొన్నారు. శనివారం ఆలమూరులో జరిగిన కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు కీలక నేతలు ఎమ్మెల్యే బండారు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు.
ఆలమూరు గ్రామ వైసిపి అధ్యక్షుడు రావాడ సత్తిబాబుతో పాటు మరికొందరు ముఖ్య అనుచరులు వైసిపిని వీడి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరందరికీ ఎమ్మెల్యే బండారు పసుపు కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘనవిజయం సాధించడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పనిచేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని, అందుకే ఇతర పార్టీల నేతలు సైతం కూటమి వైపు చూస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.పార్టీలో చేరిన నాయకులు టీడీపీ బలోపేతానికి నిరంతరం కృషి చేయాలని, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎమ్మెల్యే సూచించారు.
