వచ్చే ఎన్నికల్లో Sports కు ప్రాధాన్యం: ప్లేయర్స్ కాంక్లేవ్‌లో KTR హామీ

April 25, 2026 12:44 PM

హైదరాబాద్‌లోని Shilpakala Vedikaలో జరిగిన ‘ప్లేయర్స్ కాంక్లేవ్’ కార్యక్రమంలో K T Rama Rao కీలక వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్, తాను బాస్కెట్‌బాల్‌కు వీరాభిమానినని తెలిపారు. గత పాలనలో వ్యవసాయం, మౌలిక వసతులు, ఐటీ రంగాలకు ప్రాధాన్యత ఇచ్చామని చెప్పారు.అయితే, వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే క్రీడలకు అగ్రతాంబూలం ఇస్తామని హామీ ఇచ్చారు. క్రీడాకారులకు అవసరమైన సౌకర్యాలు, ప్రోత్సాహకాలు అందించి తెలంగాణను స్పోర్ట్స్ హబ్‌గా అభివృద్ధి చేస్తామని వెల్లడించారు.యువత సామర్థ్యాన్ని వెలికి తీసే దిశగా క్రీడా రంగానికి పెద్దపీట వేస్తామని కేటీఆర్ పేర్కొన్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media