దేశంలో గ్యాస్ కొరతపై భయాందోళనలు పెరుగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఎల్పీజీ సిలిండర్లు అందుబాటులో లేక ప్రజలు బారులు తీరుతున్నట్లు సమాచారం.
Bengaluruలో పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. బ్లాక్ మార్కెట్లో గ్యాస్ సిలిండర్ ధర రూ.1,500 వరకు పెరిగినట్లు సమాచారం. గ్యాస్ సరఫరా సమస్యల కారణంగా కొన్ని హోటళ్లు తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు హోటల్ యజమానులు తెలిపారు.గ్యాస్ కొరతపై ప్రజల్లో భయం పెరుగుతుండగా సరఫరా వ్యవస్థను సాధారణ స్థితికి తీసుకురావాలని ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వస్తున్నాయి.
