మాచర్లలో ఆటో బోల్తా: 11 మందికి గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం

April 28, 2026 10:32 AM

పల్నాడు జిల్లా మాచర్ల మండలం పోలేపల్లి అడ్డరోడ్డు వద్ద మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. కూలి పనుల కోసం పోలేపల్లి గ్రామానికి వెళ్తున్న ఆటో అదుపు తప్పి బోల్తా పడడంతో అందులో ప్రయాణిస్తున్న 11 మందికి గాయాలయ్యాయి.

వారిలో ఇద్దరి పరిస్థితి తీవ్రంగా ఉండగా, మిగిలిన వారికి స్వల్ప గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను మాచర్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.తీవ్రంగా గాయపడిన వారిలో ఒకరిని మెరుగైన చికిత్స కోసం నరసరావుపేట ప్రభుత్వాసుపత్రికి రిఫర్ చేశారు. ఈ ఘటనపై మాచర్ల రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media