భారత బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్‌లో కీలక ముందడుగు పడింది. ఇకపై హై-స్పీడ్ రైల్ కోచ్‌ల తయారీలో దేశీయ సాంకేతికతకు ప్రాధాన్యం పెరుగుతోంది. BEML ఆధ్వర్యంలో బెంగళూరులోని ఆదిత్య ప్లాంట్‌లో బుల్లెట్ ట్రైన్‌కు అవసరమైన B-28 కోచ్‌లను తయారు చేయనున్నారు.

ఈ అత్యాధునిక తయారీ యూనిట్‌ను కేంద్ర రైల్వే మంత్రి Ashwini Vaishnaw ప్రారంభించారు. ఇప్పటివరకు విదేశీ టెక్నాలజీపై ఆధారపడిన భారత్, ఇప్పుడు స్వదేశీంగా హై-స్పీడ్ రైల్ కోచ్‌లను తయారు చేసే దిశగా అడుగులు వేస్తోంది.ప్రత్యేకంగా హై-స్పీడ్ ట్రైన్ల కోసం డిజైన్ చేసిన ఈ ప్లాంట్, దేశంలో రైల్వే రంగానికి గేమ్‌చేంజర్‌గా భావిస్తున్నారు. బుల్లెట్ ట్రైన్ ప్రారంభంతో సిటీల మధ్య ప్రయాణ సమయం గణనీయంగా తగ్గి, ఆర్థిక వ్యవస్థ, ఉపాధి అవకాశాలు, కనెక్టివిటీ విస్తృతంగా మెరుగుపడనున్నాయి.

