Mahabubabad జిల్లాలోని Chinnagudur మండలంలో ఇసుక ర్యాంప్ డీల్ వ్యవహారం వివాదంగా మారింది. ఇసుక ర్యాంప్ వ్యవహారంలో తలదూర్చిన ఓ ఎస్సై రూ.1 లక్ష లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ క్రమంలో రూ.20 వేల రూపాయలను ఫోన్‌పే ద్వారా చెల్లించగా, మిగిలిన రూ.80 వేలును మూడు రోజుల్లో ఇస్తామని పేర్కొన్న స్క్రీన్షాట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ విషయంపై వివరాలు వెల్లడించేందుకు మీడియా ముందుకు వచ్చిన ఆంగోత్ బాలకృష్ణ దంపతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వాస్తవాలు చెప్పడం నేరమా అంటూ బాలకృష్ణ దంపతులను వెంటనే విడుదల చేయాలని కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
