మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలో నూతనంగా నిర్మించిన కస్తూర్బా జూనియర్ కాలేజీ భవనాన్ని ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ప్రారంభించారు.

సుమారు రూ.1.35 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ భవనం ఆధునిక సౌకర్యాలతో విద్యార్థులకు అనుకూలంగా రూపొందించబడినట్లు ఎమ్మెల్యే తెలిపారు. విశాలమైన తరగతి గదులు, మెరుగైన మౌలిక వసతులతో ఈ కాలేజీ ప్రాంత విద్యా అభివృద్ధికి దోహదపడుతుందని పేర్కొన్నారు.గ్రామీణ విద్యార్థులు కూడా నాణ్యమైన విద్యను పొందేలా ఈ నిర్మాణం ఉపయోగపడుతుందని తెలిపారు. భవనాన్ని నాణ్యతతో పూర్తి చేసిన కాంట్రాక్టర్ ఆకుల కృష్ణయ్యను అభినందించారు.ఈ సందర్భంగా విద్యార్థులకు ప్రేరణాత్మక సందేశం ఇచ్చిన ఎమ్మెల్యే, క్రమశిక్షణ, కృషి, పట్టుదలతో లక్ష్యాలను సాధించాలని సూచించారు. మైదుకూరు నియోజకవర్గంలో విద్యా అభివృద్ధికి తాను కట్టుబడి ఉన్నానని తెలిపారు.కార్యక్రమంలో జిల్లా విద్యా అధికారి షంషుద్దీన్, స్థానిక ప్రజాప్రతినిధులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

