పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి Mamata Banerjee ప్రధాని Narendra Modi చేసిన ‘జాల్‌మురి బ్రేక్’ పూర్తిగా డ్రామా అని ఆరోపించారు.

జార్గ్రామ్‌లో ఎన్నికల ప్రచారం అనంతరం మోదీ ఒక స్ట్రీట్ ఫుడ్ షాప్‌లో జాల్‌మురి తిన్న ఘటనపై స్పందించిన మమతా, అది ముందే ప్లాన్ చేసిన ఈవెంట్ అని పేర్కొన్నారు. “అది ఆకస్మికం కాదు, కెమెరాలు, మైక్ అన్నీ ముందుగానే ఏర్పాటు చేశారు” అని విమర్శించారు.ఈ ఘటనను ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజలను ఆకర్షించేందుకు చేసిన ప్రయత్నంగా ఆమె అభివర్ణించారు. అదేవిధంగా బీజేపీపై తీవ్ర విమర్శలు చేస్తూ, స్వతంత్ర అభ్యర్థులను ఉపయోగించి ఓట్లను చీల్చే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు.ఎన్నికల ముందు టీఎంసీ నేతలను లక్ష్యంగా చేసుకుని అరెస్టులు చేసే కుట్ర జరుగుతోందని కూడా మమతా బెనర్జీ అనుమానం వ్యక్తం చేశారు.
