కడపజిల్లా(బిఎన్ఎస్)మార్చి 30: తిరుమల,తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అంగరంగ వైభవంగా ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి వారి కళ్యాణంను నిర్వహించేందుకు అందరూ కలిసి బాధ్యత యుతంగా పనిచేసి విజయవంతం చేయాలని జిల్లా ఇన్చార్జి మంత్రి ఎస్.సవిత పేర్కొన్నారు. ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి వారికి ఏప్రిల్ 1 కల్యాణోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పట్టు వస్త్రాల సమర్పణ మరియు కళ్యాణోత్సవం ఏర్పాట్లపై జిల్లా ఇన్చార్జి మంత్రి సవిత పర్యవేక్షించారు. కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి, టిటిడి జేఈఓ వీరబ్రహ్మంలతో కలిసి సమన్వయ సమావేశం టిటిడి మరియు జిల్లా అధికారులతో నిర్వహించారు. ఈసందర్భంగా ఇన్చార్జిమంత్రిమాట్లాడుతూ… ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి వారి కళ్యాణంను అంగరంగ వైభవంగా… కన్నుల పండుగగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతున్నదనన్నారు. టీటీడీ మరియు జిల్లా యంత్రాంగం సమన్వయంతో గత పది రోజులుగా పనిచేయడం జరుగుతోందని చెప్పారు. క్యూ లైన్లలో త్రాగునీరు, ప్రసాదాల పంపిణీ చేయాలని మంత్రి సవిత సూచించారు.
భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగరాదు.. ఇంచార్జి మంత్రి ఎస్.సవిత..!!
