వరంగల్ (బీఎన్ఎస్) బుధవారం ములుగు జిల్లా మల్లంపల్లి మండల కేంద్రంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క,జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ తో కలిసి పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ విభాగం ఉపాధి హామీ పథకం పది లక్షల రూపాయల నిధులతో గ్రామైక్య సంఘం భవన నిర్మాణానికి, సి ఆర్ ఆర్ 72.50 లక్షల రూపాల నిధులతో అంతర్గత సిసి రోడ్డు నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంపత్ రావు, గ్రంధాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్,డి ఆర్ డి ఓ, శ్రీనివాస్,పంచాయతీ రాజ్ ఈ ఈ అజయ్ కుమార్,అడిషనల్ డి ఆర్ డి ఓ శ్రీనివాస్,ఆర్డబ్ల్యూఎస్ డి ఈ సునీత,మండల ప్రత్యేక అధికారి కృపాకర్, సర్పంచ్ శ్యామ్ రావు,యం పి ఓ, సంబంధిత అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
