జాతీయ బాలికా దినోత్సవం వేడుకలు: హోం మంత్రి అనిత

January 24, 2026 5:58 PM

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశయాలకు అనుగుణంగా ‘స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర’ లక్ష్య సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత పిలుపునిచ్చారు. శనివారం కశింకోట మండలం తేగాడ మోడల్ పాఠశాలలో జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్‌తో కలిసి ఆమె ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


పారిశుధ్య కార్మికుల సేవలను గుర్తించి వారిని ఘనంగా సన్మానించారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు.విద్యార్థులే మార్పుకు వారధులు: గ్రామాల అభివృద్ధి ఇంటి నుండే ప్రారంభం కావాలని, పరిశుభ్రతపై పాఠశాల స్థాయి నుండే విద్యార్థులకు అవగాహన కల్పించాలని మంత్రి సూచించారు. బాలికలతో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. సోషల్ మీడియా మాయలో పడి జీవితాలు నాశనం చేసుకోకుండా, చట్టాలపై అవగాహన పెంచుకుని ఉన్నత శిఖరాలకు చేరాలని బాలికలకు ధైర్యం చెప్పారు. విద్యార్థుల విజ్ఞప్తి మేరకు పాఠశాలకు త్వరలోనే క్రీడా మైదానం (గ్రౌండ్) ఏర్పాటు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media