ప్రధాని Narendra Modi అమెరికా అధ్యక్షుడు Donald Trumpకు సరెండర్ అయ్యారని ఖైరతాబాద్ DCC అధ్యక్షుడు Motha Rohith ఆరోపించారు.
ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని Basheer Bagh చౌరస్తాలోని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం నుండి Abidsలోని జవహర్ లాల్ నెహ్రూ విగ్రహం వరకు కాంగ్రెస్ నేతలు నిరసన ర్యాలీ నిర్వహించారు. “PM is Compromised” అనే బ్యానర్‌తో నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా మోత రోహిత్ మాట్లాడుతూ భారత్-పాక్ యుద్ధం తన కారణంగా ఆగిందని ట్రంప్ ప్రకటించినా, మోడీ స్పందించకపోవడం అనుమానాలకు తావిస్తోందని అన్నారు. ట్రంప్ భారత్‌పై ప్రభావం చూపుతున్నాడని విమర్శించారు. ఆరోపణలపై ప్రధాని స్పష్టత ఇవ్వాలని, లేకపోతే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
