శ్రీరామునికి ముస్లిం సోదరుల పూజలు

March 27, 2026 7:21 PM

అనకాపల్లి జిల్లా,మార్చి 27 పాయకరావుపేట : నక్కపల్లి మండలం పెద్ద బోధిగళం గ్రామంలో హిందూ–ముస్లిం ఐక్యత మరోసారి ప్రతిఫలించింది. పూర్వం నుంచే ఈ గ్రామంలో మతభేదాలకు అతీతంగా ప్రజలు కలిసి శ్రీరామ నామోత్సవాలను నిర్వహిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
గ్రామంలోని శ్రీరాముల వారి ఆలయం శిధిలావస్థకు చేరుకోవడంతో ముస్లిం సోదరులు ముందుకు వచ్చి సేవాభావాన్ని చాటారు.హిందువులతో కలిసి చందాలు సేకరించి ఆలయ పునరుద్ధరణలో భాగస్వాములయ్యారు.గ్రామస్తుల సమిష్టి కృషితో ఆలయానికి కొత్త జీవం ప్రసాదించారు.పునఃప్రారంభం అనంతరం నిర్వహించిన శ్రీరామ నామోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి.ఈ వేడుకల్లో హిందూ,ముస్లిం సోదరులు సమానంగా పాల్గొని భక్తి,ఐక్యతను ప్రతిబింబించారు.గ్రామంలో నెలకొన్న ఈ సోదరభావం ఇతర ప్రాంతాలకు మార్గదర్శకంగా నిలుస్తోంది.
ఈ కార్యక్రమంలో మునిషా బేగం,ఇమాన్ హుస్సేన్, లక్ష్మణరావు,గింజల నాగేశ్వరరావు,గింజల శ్రీను,దేవర్ నాయుడు,అప్పలరాజు (ఎన్‌టీఆర్) తదితరులు పాల్గొన్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media