జాతీయస్థాయిలో “చేముల్లపల్లె”పంచాయతీకి గుర్తింపు..!

April 1, 2026 7:29 PM

కడపజిల్లా(బిఎన్ఎస్)ఏప్రిల్ 01:మైదుకూరు నియోజకవర్గ పరిధి,ఖాజీపేటమండలం.. చెముళ్లపల్లె పంచాయతీ..ఆ గ్రామంలో ఉండేది 692 ఇళ్లు. నివసించేది 2,419 మంది ప్రజలు.అయితేనేం దేశ వ్యాప్తంగా ఉన్న 2.5 లక్షలకు పైగా పంచాయతీలతో పోటీ పడింది.పేదరిక నిర్మూలన కార్యక్రమాలు,ఉపాధి అవకాశాలు కల్పన,స్వయం సహాయక సంఘాల బలోపేతం,పారదర్శక పాలనలో శభాష్ అనిపించుకుంది.కేంద్ర ప్రభుత్వం నుంచి ద్వితీయ అవార్డు దక్కించుకుని జాతీయ స్థాయిలో మెరిసింది.మార్చి 9న కేంద్ర బృందం ఖాజీపేట మండలంలోని చెముళ్లపల్లెలో పర్యటించింది.అనేక అంశాలను పరిశీలించింది. గ్రామస్థులతో మమేకమైంది. పేదరిక నిర్మూలన-మెరుగైన జీవనోపాధుల కల్పనలో జాతీయ స్థాయిలో ద్వితీయ అవార్డుకు ఎంపిక చేసింది. .
ఇందుకుగాను చెముళ్లపల్లె పంచాయతీకి కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహం అందించనుంది. ఆ పంచాయతీ ఖాతాలో రూ. 75 లక్షలు జమ చేయనున్నట్లు జిల్లా పంచాయతీ అధికారి వెంకట సుబ్బయ్య తెలిపారు..

కేంద్ర బృందం పరిశీలించిన అంశాలు

అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందించడం.ఆ పథకాలతో ప్రజలు సంతృప్తిగా ఉన్నారా?లేక ఇంకా ఏమైనా ఆశిస్తున్నారా? అనే అంశాన్ని కేంద్రం బృందం పరిశీలించింది.చెముళ్లపల్లెలో ఎక్కడా పెంకుటిల్లు కానీ,బోధ కొట్టాలు కనిపించలేదు.అన్నీ ఆర్ సి బిల్డింగులే ఉన్నాయి..
గ్రామంలో అన్ని ఇళ్లకు కుళాయి కనెక్షన్లు ఇచ్చారు. వైద్య సేవలు అందిస్తున్నారు..
ఆ గ్రామంలో ఏటా మూడు పంటలను రైతులు పండిస్తున్నట్లు కేంద్ర బృందం గుర్తించింది..గ్రామ సచివాలయం తరఫున సదుపాయాలు అందుతున్నదీ లేనిదీ పరిశీలించడంతో పాటు సంతృప్త స్థాయిని పరిగణనలోకి తీసుకుంది..
సర్పంచి బుజ్జి,కార్యదర్శి ఇంటింటికీ వెళ్లి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన చేశారు.అలాగే సంక్షేమ పథకాల నిజమైన లబ్ధిదారులకు అందుతున్నాయా? లేదా? అనే విషయాన్ని ఈ కార్యక్రమంలో తెలుసుకున్నారు అలాగే ఈ గ్రామంలోని ప్రతి కుటుంబానికి ప్రభుత్వం కల్పిస్తున్న ప్రతి సంక్షేమ పథకాలు నిజమైన అర్హులకే చేస్తున్నట్లు తెలుసుకున్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media