నెల్లూరులో హోటళ్లపై కలెక్టర్ Shukla ఆకస్మిక తనిఖీలు

April 25, 2026 12:26 PM

ఆంధ్రప్రదేశ్‌లోని Nellore నగరంలో హోటళ్లపై జిల్లా కలెక్టర్ Himanshu Shukla ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి పలు హోటళ్లను పరిశీలించారు.

ఈ సందర్భంగా హోటళ్ల పరిసరాలు, వంటగది పూర్తిగా పరిశుభ్రంగా ఉండాలని, గడువు ముగిసిన పదార్థాలు లేదా నిల్వ మాంసం వినియోగిస్తే హోటళ్లను సీజ్ చేస్తామని కలెక్టర్ హెచ్చరించారు. ఒకసారి ఉపయోగించిన నూనెను మళ్లీ వాడరాదని స్పష్టం చేశారు.Hotel Riyaz మరియు Basato Hotelల్లో పరిశుభ్రత లోపాలు గుర్తించి, ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇంప్రూవ్‌మెంట్ నోటీసులు జారీ చేశారు. రెండు వారాల్లోగా పరిస్థితులు మెరుగుపరచాలని సూచించారు.ప్రజలకు నాణ్యమైన, తాజా ఆహారం అందించాల్సిన బాధ్యత హోటల్ నిర్వాహకులదేనని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు స్పష్టం చేశారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media