నెల్లూరు రూరల్ హత్యాయత్నం కేసు ఛేదన 5గురు నిందితుల అరెస్ట్

January 28, 2026 6:27 PM

పాత కక్షల నేపథ్యంలో ఈనెల 26న ఈదురు సుశాంత్, హర్షవర్ధన్‌లపై జరిగిన హత్యాయత్నం కేసును నెల్లూరు రూరల్ పోలీసులు వేగంగా ఛేదించారు. ఈ దాడికి పాల్పడిన ఐదుగురు నిందితులను అరెస్టు చేసినట్లు డీఎస్పీ గట్టంనేని శ్రీనివాసరావు వెల్లడించారు.
బాధితుడు సుశాంత్ తన అన్న హర్షవర్ధన్ ఇంటికి వెళ్తుండగా.. కాసు మోహన్, కాకాణి రాజేష్, బోడెద్దుల శ్రీనివాసులు, కాసు కళ్యాణ్, కొలగట్ల ఉమ్మయ్య అనే వ్యక్తులు మోటార్ బైక్‌పై వచ్చి అడ్డగించారు. నిందితుడు కాకాణి రాకేష్ కత్తితో సుశాంత్ చాతిపై బలంగా గుద్దడంతో అతను కిందపడిపోయాడు. అడ్డువచ్చిన సుశాంత్ సోదరుడు హర్షవర్ధన్, స్నేహితుడు అమిన్‌లపై కూడా నిందితులు దాడికి తెగబడ్డారు. బాధితులు కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి చేరుకున్నారు. దీంతో నిందితులు అక్కడి నుండి పరారయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సాంకేతిక ఆధారాలతో నిందితులను పట్టుకున్నారు. నిందితులను రిమాండ్‌కు తరలిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఈ కేసును వేగంగా ఛేదించిన పోలీస్ అధికారులను, సిబ్బందిని డీఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media