Nizamabad నగరంలోని గోపాల్‌బాగ్ గోశాలలో ఉన్న పురాతన శివాలయంలో విగ్రహాల ధ్వంసం ఘటనపై వెంటనే నిందితులను గుర్తించి చర్యలు తీసుకోవాలని అర్బన్ ఎమ్మెల్యే Dhanpal Suryanarayana డిమాండ్ చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా హిందూ ఆలయాలపై దాడులు జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం స్పందించడం లేదని ఆయన విమర్శించారు. మూడు రోజుల క్రితం జరిగిన ఈ ఘటనలో ఇప్పటికీ నిందితులను పట్టుకోకపోవడం ఆందోళన కలిగిస్తోందన్నారు.గోపాల్‌బాగ్ గోశాలలో సుమారు 150 ఆవులు ఉన్నాయని, ఆలయంలో భద్రత లేకపోతే గోమాతలకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో ఉన్న గోశాల స్థలంపై కబ్జాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ జిల్లా యంత్రాంగం వెంటనే స్పందించాలని కోరారు.ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే సూచించారు.

