Nizamabad మార్కెట్ యార్డులో పసుపు రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పసుపు ధరలు తీవ్రంగా పడిపోవడంపై రైతులు ఆందోళనకు దిగారు.
ధరల తగ్గుదలకు దళారులు కారణమని ఆరోపిస్తూ రైతులు మార్కెట్ యార్డులోని భవనంలోకి చొచ్చుకెళ్లి ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో మార్కెట్ యార్డులో ఉద్రిక్తత నెలకొంది.రైతులు దళారులతో కుమ్మకై ధరలను కృత్రిమంగా తగ్గిస్తున్నారని ఆరోపిస్తూ, తగిన మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.
