మోడల్ స్టేషన్‌గా పిఠాపురం:అమృత్ భారత్ స్కీం కింద అభివృద్ధి

January 28, 2026 6:09 PM

ఆధ్యాత్మిక క్షేత్రం పిఠాపురంను పర్యాటక మరియు రైల్వే పరంగా ప్రపంచస్థాయిలో తీర్చిదిద్దేందుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక అడుగులు వేశారు. బుధవారం ఢిల్లీలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసి నియోజకవర్గంలోని పలు రైల్వే ప్రాజెక్టులపై చర్చించారు.

పిఠాపురం అష్టాదశ శక్తిపీఠం మరియు శ్రీపాద శ్రీవల్లభ స్వామి జన్మస్థలం కావడంతో, దేశవిదేశాల నుంచి వచ్చే భక్తుల కోసం రైల్వే స్టేషన్‌ను అమృత్ భారత్ స్కీం కింద మోడల్ స్టేషన్‌గా అభివృద్ధి చేయాలని పవన్ కళ్యాణ్ కోరారు. పిఠాపురంలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు లెవల్ క్రాసింగ్‌లను తొలగించి, రోడ్డు ఓవర్ బ్రిడ్జి (ROB) నిర్మాణాన్ని పీఎం గతిశక్తి పథకంలో చేర్చాలని విన్నవించారు.2030 జాతీయ రైల్వే ప్రణాళికకు అనుగుణంగా మౌలిక వసతుల కల్పనపై చర్చించారు. పవన్ కళ్యాణ్ విన్నపాలకు అశ్విని వైష్ణవ్ సానుకూలంగా స్పందించారు. ఏపీలో పెండింగ్‌లో ఉన్న ఇతర రైల్వే ప్రాజెక్టులను కూడా వేగవంతం చేస్తామని భరోసా ఇచ్చారు.ఈ సందర్భంగా తనను ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని, ఏపీ అభివృద్ధికి చేస్తున్న కృషిని అభినందించిన కేంద్ర మంత్రికి పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలియజేశారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media