నెల్లూరు జిల్లా Rapur మండలంలోని Penchalakona Lakshmi Narasimha Swamy Templeలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో ఓ సాధారణ కూరగాయల వ్యాపారి సేవా కార్యక్రమం భక్తులను ఆకట్టుకుంటోంది.
తిరుపతికి చెందిన పుసుపులేటి నాగరాజు అనే వ్యాపారి, స్వామివారి పట్ల ఉన్న భక్తితో గత 7 ఏళ్లుగా ప్రతి సంవత్సరం అన్నదానానికి మూడున్నర టన్నుల కూరగాయలను ఉచితంగా అందిస్తున్నారు. ఈ ఏడాది కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ బ్రహ్మోత్సవాల సందర్భంగా భారీగా కూరగాయలను సమకూర్చారు.“దైవ సేవ అంటే కేవలం పూజలు మాత్రమే కాదు, భక్తుల ఆకలి తీర్చడం కూడా” అని నాగరాజు తెలిపారు. తన కుటుంబానికి స్వామివారి అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఈ సేవను కొనసాగిస్తున్నట్టు చెప్పారు.
