ప్రముఖ పుణ్యక్షేత్రం పెంచలకోన దేవస్థానంకు ఇంచార్జి ఈఓగా కోవూరు జనార్దన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు.
ఇప్పటివరకు ఈఓగా పనిచేస్తున్న పోరెడ్డి శ్రీనివాసులు రెడ్డి సెలవుపై వెళ్లడంతో, జిల్లా దేవాదాయ శాఖ అధికారులు జనార్దన్ రెడ్డిని ఇంచార్జి ఈఓగా నియమించారు.పెంచలకోన చేరుకున్న ఆయన, లక్ష్మీ నరసింహస్వామి, ఆదిలక్ష్మి అమ్మవారు, ఆంజనేయ స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం బాధ్యతలు స్వీకరించారు.బ్రహ్మోత్సవాల సమయంలో ఈఓ సెలవుపై వెళ్లడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంలో రాజకీయ ఒత్తిడి ఉందా అనే అంశంపై రాపూరు మండలంలో చర్చ సాగుతోంది.
