అర్ధరాత్రి PG హాస్టళ్లలో డ్రామా Raid..పేరుతో హింసించిన ASP

April 13, 2026 12:25 PM

జిల్లా SP షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు మన్నూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని బోయినపల్లిలో పీజీ హాస్టళ్లలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు.

రాజంపేట ఏఎస్పీ మనోజ్ రామనాథ్ హెగ్డే ఆధ్వర్యంలో పోలీస్ బృందం శనివారం రాత్రి హాస్టళ్లలో సమగ్ర తనిఖీలు చేపట్టింది. నివాస సౌకర్యాలు పరిశీలించి, విద్యార్థులు మరియు స్థానికులతో మాట్లాడి అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా విద్యార్థులు ఎలాంటి నేర, అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, గంజాయి వంటి మత్తుపదార్థాలను వినియోగించరాదని సూచించారు. పబ్లిక్ ప్రదేశాల్లో శాంతి భద్రతలకు భంగం కలిగించే కార్యక్రమాలు నిర్వహించవద్దని హెచ్చరించారు.ప్రజా శాంతి భద్రతలను కాపాడటం అందరి బాధ్యత అని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media