తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పీఎంకే చీఫ్ S. Ramadoss అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. ఎన్నికల సభలో ప్రసంగిస్తున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలడంతో పార్టీ శ్రేణులు అప్రమత్తమయ్యాయి.
వెంటనే ఆయనను సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు.ఈ ఘటనతో Salemలోని ఆసుపత్రి వద్దకు పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు చేరుకుంటుండగా, రాష్ట్ర రాజకీయాల్లో ఈ సంఘటన చర్చనీయాంశంగా మారింది.
