బిల్లులు రావడం లేదని ఆవేదన MLA పోచారం శ్రీనివాస్ రెడ్డి

April 13, 2026 11:05 AM

సిద్ధాపూర్ రిజర్వాయర్ వద్ద ప్రభుత్వ సలహాదారుడు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి బిల్లుల చెల్లింపుల విషయంలో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు అక్కడే ఉండి పరిస్థితిపై స్పందించారు.

మంత్రులకు పలుమార్లు ఫోన్ చేసినా స్పందన లేదని, ముఖ్యమంత్రికి కూడా 20సార్లు ఫోన్ చేసినా స్పందించలేదని తెలిపారు. బిల్లులు రాకపోవడంతో అభివృద్ధి పనులు నిలిచిపోయాయని, కాంట్రాక్టర్లు వెనక్కి వెళ్లిపోతున్నారని పేర్కొన్నారు.తాను సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ఫోన్ లేపడం లేదని, ఇలాంటి పరిస్థితి తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల సమస్యల కోసం చేసిన కాల్స్‌కే స్పందన లేకపోతే ఎలా పని చేయాలన్న ప్రశ్నను లేవనెత్తారు.పై స్థాయి అధికారుల విజ్ఞప్తితో రెండు రోజులు వేచి చూడాలని నిర్ణయించి అనంతరం అక్కడి నుంచి వెళ్లినట్లు సమాచారం.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media