బీజేపీలో చేరుతున్నారనే ప్రచారంపై మల్లారెడ్డి కోడలు ప్రీతి రెడ్డి క్లారిటీ ఇచ్చారు. తాను ఎలాంటి రాజకీయ నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు.
ఏఐ క్యాంపస్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించేందుకు మాత్రమే వెళ్లినట్లు తెలిపారు. ఈ సందర్భంగా వచ్చిన ఊహాగానాలు పూర్తిగా అసత్యమని పేర్కొన్నారు.రాజకీయాల్లో చేరడం లేదా పార్టీ మార్పు గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని ప్రజలను కోరారు.
