ప్రజల అభిప్రాయానికే ప్రాధాన్యం అన్న డ్యాన్స్ మాస్టర్
ప్రముఖ డ్యాన్స్ మాస్టర్, నటుడు Raghava Lawrence రాజకీయ ప్రవేశంపై స్పష్టత ఇచ్చారు. ప్రజలు ఆమోదిస్తే రాజకీయాల్లోకి వస్తానని, అలా కాకపోతే దూరంగానే ఉంటానని తెలిపారు. రాజకీయాల్లోకి వస్తారా లేదా అన్న విషయంపై త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తానని చెప్పారు.
తిరుచ్చి నుంచి పోటీపై ప్రచారం
గత కొన్నేళ్లుగా Raghava lawrence అనాధ పిల్లల సంక్షేమం కోసం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎంతోమంది అనాధ పిల్లలకు అండగా నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన రాజకీయాల్లోకి వస్తారన్న ప్రచారం తమిళనాడులో జోరుగా సాగుతోంది.
ముఖ్యంగా తిరుచ్చి నియోజకవర్గం నుంచి లారెన్స్ పోటీ చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఆ నియోజకవర్గానికి సంబంధించిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ ప్రచారం మరింత ఊపందుకుంది.
ఈ తరుణంలోనే ప్రజల అభిప్రాయమే తన నిర్ణయానికి ఆధారమని లారెన్స్ వెల్లడించారు.
లారెన్స్ వ్యాఖ్యలు తమిళనాడు రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి. సినీ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఆయన, సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా కూడా ప్రజలకు చేరువయ్యారు. అందుకే రాజకీయాల్లోకి వస్తారన్న ఊహాగానాలు చాలా కాలంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా యువతలో, ఆయన అభిమానుల్లో ఈ అంశంపై ఆసక్తి నెలకొంది.
Also read,



