లోక్‌సభలో డిలిమిటేషన్ మరియు మహిళల రిజర్వేషన్ బిల్లులపై తీవ్ర రాజకీయ వాదోపవాదాలు కొనసాగుతున్నాయి. ప్రతిపక్ష నేత Rahul Gandhi కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తూ, ఈ బిల్లులు మహిళల సాధికారత కోసం కాకుండా దేశ ఎన్నికల మ్యాప్‌ను మార్చేందుకు తీసుకువచ్చినవని ఆరోపించారు.
రాహుల్ గాంధీ మాట్లాడుతూ, డిలిమిటేషన్ ప్రక్రియ ద్వారా దక్షిణ భారత రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాలు మరియు చిన్న రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని తగ్గించే ప్రయత్నం జరుగుతోందని అన్నారు. అలాగే ఓబీసీలు, దళితులు, గిరిజనులు మరియు మైనారిటీల రాజకీయ ప్రాధాన్యతను తగ్గించే కుట్రగా ఈ చర్యలను ఆయన అభివర్ణించారు.
ప్రభుత్వం మహిళల రిజర్వేషన్ పేరుతో అసలు లక్ష్యాన్ని దాచిపెడుతోందని, ఇది ఫెడరల్ వ్యవస్థకు ప్రమాదమని పేర్కొన్నారు. “మీరు భారత్ కాదు… మీరు ఒక రాజకీయ పార్టీ మాత్రమే” అంటూ ఆయన వ్యాఖ్యానించడం సభలో ఉద్రిక్తతకు దారితీసింది.రాహుల్ వ్యాఖ్యలపై రక్షణ మంత్రి Rajnath Singh అభ్యంతరం వ్యక్తం చేయగా, కేంద్ర మంత్రి Kiren Rijiju కూడా ఆయన వ్యాఖ్యలను ఖండించారు.తన ప్రసంగం చివరలో రాహుల్ గాంధీ “16” అనే సంఖ్యపై పజిల్ విసురుతూ రాజకీయంగా చర్చకు కొత్త దారితీశారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి
