రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల

May 22, 2026 11:13 AM

దేశవ్యాప్తంగా ఖాళీ కానున్న 24 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. రాజ్యసభ ఎన్నికలకు జూన్‌ 18న పోలింగ్‌ నిర్వహించనున్నారు. అదే రోజు ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. వైసీపీకి చెందిన ముగ్గురు సభ్యులు, టీడీపీకి చెందిన ఒక సభ్యుడి పదవీకాలం ముగియనుంది. ప్రస్తుతం అసెంబ్లీలో ఉన్న సంఖ్యాబలం ప్రకారం ఈ నాలుగు స్థానాలు కూటమి ఖాతాలోకే వెళ్లే అవకాశం కనిపిస్తోంది.

వైసీపీ నుంచి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, అయోధ్య రామిరెడ్డి, పరిమళ్‌ నత్వాని పదవీకాలం పూర్తికానుంది. టీడీపీ నుంచి సానా సతీష్‌ పదవీకాలం కూడా ముగియనుంది.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media