పలు రాష్ట్రాల్లో ఖాళీ అవుతున్న 27 రాజ్యసభ స్థానాలు, మూడు రాష్ట్రాల్లోని శాసనమండలి స్థానాల భర్తీకి ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. కేంద్ర ఎన్నికల సంఘం అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం, నామినేషన్లు దాఖలు చేయడానికి జూన్ 8 చివరి తేదీ. జూన్ 9న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడానికి జూన్ 11 వరకు గడువు ఉంటుంది. జూన్ 18న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడిస్తారు. బీహార్‌లో నితీశ్ కుమార్ రాజీనామాతో ఖాళీ అయిన ఒక ఎమ్మెల్సీ స్థానానికి కూడా ఉప ఎన్నిక జరగనుంది.
బీహార్‌లో నితీశ్ కుమార్ రాజీనామాతో ఖాళీ అయిన ఒక ఎమ్మెల్సీ స్థానానికి కూడా ఉప ఎన్నిక జరగనుంది. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, ఝార్ఖండ్, మధ్యప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, రాజస్థాన్, అరుణాచల్ ప్రదేశ్, కర్ణాటక, మిజోరాం రాష్ట్రాల్లో మొత్తం 24 రాజ్యసభ స్థానాలకు ద్వైవార్షిక ఎన్నికలు జరగనున్నాయి. మహారాష్ట్ర, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాల్లో ఒక్కో రాజ్యసభ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించనున్నారు. శాసనమండలి ఎన్నికలకు సంబంధించి బీహార్‌లో 9, కర్ణాటకలో 7 స్థానాలకు ద్వైవార్షిక ఎన్నికలు జరగనున్నాయి.

