ఈ సినిమా చూసి నేర్చుకోండి: రామ్ గోపాల్ వర్మ

June 8, 2026 9:50 AM
rgv about obsession movie

ప్రస్తుతం హాలీవుడ్ ను ఓ సినిమా శాసిస్తోంది. కర్రీ బార్కర్ దర్శకత్వంలో వచ్చిన ‘అబ్సెషన్’ చిత్రాన్ని కేవలం 7,50,000 డాలర్ల (సుమారు రూ. 6.5 కోట్లు) బడ్జెట్‌తో నిర్మించారు. కానీ ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద 170-179 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 1,500 కోట్లు) వసూళ్లను సాధించి సంచలనం సృష్టించింది.

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘అబ్సెషన్’పై ప్రశంసల వర్షం కురిపించారు. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా సాధించిన విజయం, సినీ పరిశ్రమలోని నమ్మకాలను మార్చేస్తుందని, ఇది ఒక ‘రీసెట్ బటన్’ లాంటిదని అభిప్రాయపడ్డారు. ఈ సినిమాను పెద్ద స్టార్లు లేకుండా, భారీ సెట్టింగులు కాకుండా కేవలం ఓ ఇంట్లోని రెండు గదులు, కారు, ఒక చిన్న స్టోర్‌లో చిత్రీకరించారన్నారు. దీని అసలు నిర్మాణ వ్యయం రూ. 70 లక్షలకు మించి ఉండదని ఆయన అంచనా వేశారు. దర్శకుడి టేకింగ్, కెమెరా పనితనం, ఎడిటింగ్ శైలి, ముఖ్యంగా సౌండ్ డిజైన్ టెక్నిక్స్ అద్భుతంగా ఉన్నాయని కొనియాడారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media