తెలంగాణలో ఎండలు మామూలుగా లేవు. ఆ వేడిని తట్టుకోవడానికి ప్రజలు వైన్స్ షాపులకు ఎగబడుతున్నారు. చల్లని బీర్లు తాగుతూ సేద దీరుతున్నారు. ఒక్క ఏప్రిల్‌లోనే దాదాపు 6 కోట్ల బీర్లు తాగేశారు. గత ఏడాది ఏప్రిల్‌తో పోలిస్తే ఈసారి సేల్స్ భారీగా పెరిగాయి. గత సంవత్సరం మార్చిలో 39 లక్షల కేస్ ల బీర్లు అమ్ముడు పోగా, ఈ సంవత్సరం మార్చిలో దాదాపు 50 లక్షల కేస్ లకు చేరింది. దీనికి ప్రధాన కారణం విపరీతమైన ఎండలు, ఐపీఎల్ ఫీవర్, పెళ్లిళ్లు. రోజుకు 3 లక్షల కేస్ ల ఆర్డర్లు వస్తుంటే కంపెనీలు తయారు చేయలేకపోతున్నాయి. 2 లక్షల కేస్ లు మాత్రమే సప్లై చేయగలగుతున్నారు. ఈ ఆర్డర్స్ ను తట్టుకోవడానికి ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ ‘ration system’ ప్రవేశపెట్టింది. ప్రతి వైన్ షాప్ కు కోటా నిర్ణయిస్తున్నారు. మే నెల ముగిసేసరికి 75 లక్షల కేస్ ల బీర్లు అమ్ముడుపోయే అవకాశముందంటున్నాయి ఎక్సైజ్ శాఖాధికారులు.
