కళాశాల ప్రవేశాల పనులు ముగించుకుని వస్తుండగా Road accident,
ఎదురుగా వచ్చిన ట్రాక్టర్‌ను ఢీకొట్టిన బైక్
కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో Road accident లో ఇద్దరు అన్నదమ్ముల ప్రాణాలు తీసింది. దుమ్ముగూడెం మండలం చిన్న బండిరేవు గ్రామం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.
చెర్ల మండలం గొంపెల్లి గ్రామానికి చెందిన చుంచు సంతోష్ (20), అతని తమ్ముడు చుంచు చరణ్‌సాయి (17) గురువారం సాయంత్రం భద్రాచలంలో కళాశాల ప్రవేశాల పనులు ముగించుకుని మోటార్‌సైకిల్‌పై ఇంటికి బయలుదేరారు. చిన్న బండిరేవు గ్రామం వద్దకు చేరుకోగానే ఎదురుగా వస్తున్న ట్రాక్టర్‌ను వారి బైక్ బలంగా ఢీకొట్టింది.
ఈ ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న భద్రాచలం డీఎస్పీ అరుణ్‌కుమార్, ఇన్‌స్పెక్టర్ వెంకటప్పయ్య ఘటనాస్థలాన్ని పరిశీలించారు. ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభించారు.
అన్నదమ్ముల మృతితో వారి స్వగ్రామమైన గొంపెల్లిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. శుక్రవారం పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు.
Also read
ఇంటికి చేరకముందే మృత్యువు
కళాశాల ప్రవేశాల పనులు ముగించుకుని ఇంటికి తిరుగు ప్రయాణంలో ఇద్దరు అన్నదమ్ములు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదాన్ని నింపింది.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. యువకుల అకాల మరణంతో గొంపెల్లి గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది.

