నాగోలు యువతి రోజా రమణి మృతి
దుర్గం చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న రోజా రమణి
లోన్ ఏజెంట్ల వేధింపులే కారణమని భావిస్తున్న పోలీసులు
హైదరాబాద్: దుర్గం చెరువులో మృతి చెందిన యువతి వివరాలను సైబరాబాద్ పోలీసులు గుర్తించారు. మృతురాలు నాగోలుకు చెందిన రోజా రమణి (26)గా గుర్తించారు పోలీసులు.
అసలేం జరిగిందంటే..?
పోలీసుల కథనం ప్రకారం.. రోజా రమణి మాదాపూర్‌లోని ఒక ఆసుపత్రిలో అకౌంటెంట్‌గా పనిచేస్తోంది. ఇటీవల ఆమె కనిపించకుండా పోవడంతో, ఆమె తల్లిదండ్రులు నాగోలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసుగా ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.
అయితే, గత శుక్రవారం ఒక యువతి దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి పైనుంచి దూకేసిందని పోలీసులకు సమాచారం రావడంతో.. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు, హైడ్రాలిక్ క్రేన్ సహాయంతో గాలింపు చర్యలు చేపట్టి, ఆమె మృతదేహాన్ని వెలికితీశారు. దర్యాప్తులో ఆ మృతదేహం రోజా రమణిదేనని పోలీసులు గుర్తించారు.
వేధింపులే కారణమా?
బ్యాంక్ లోన్ రికవరీ ఏజెంట్ల వేధింపుల వల్లే రోజా రమణి ఈ ఘాతుకానికి ఒడిగట్టి ఉండవచ్చని ప్రాథమికంగా పోలీసులు అంచనా వేస్తున్నారు. ఈ ఘటనపై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ALSO READ



