10 నెలల్లో 15 వేల RI పెండింగ్ కేసులు పరిష్కారం

April 28, 2026 5:02 PM

రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న ఆర్టీఐ కేసుల పరిష్కారానికి చర్యలు వేగవంతం చేసినట్లు తెలంగాణ రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ డా. జి. చంద్ర శేఖర్ రెడ్డి తెలిపారు.

నల్లగొండ కలెక్టరేట్‌లో నిర్వహించిన ఆర్టీఐ అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ, గత 10 నెలల్లో దాదాపు 15 వేల పెండింగ్ కేసులను పరిష్కరించినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సమాచార కమిషన్ సభ్యులు పి.వి. శ్రీనివాస్ రావు, మోహసినా పర్వీన్, దేశాల భూపాల్, బోరెడ్డి అయోధ్య రెడ్డి పాల్గొన్నారు.

ప్రభుత్వ సమాచారం పారదర్శకంగా ప్రజలకు అందించడం తమ ప్రధాన లక్ష్యమని, పౌరులు అడిగిన సమాచారం గడువులోగా అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని ఆయన స్పష్టం చేశారు.రాష్ట్రవ్యాప్తంగా ప్రతి సంవత్సరం సుమారు 1.20 లక్షల మంది ఆర్టీఐ ద్వారా సమాచారం పొందుతున్నారని తెలిపారు. ప్రస్తుతం కమిషన్ స్థాయిలో 28 వేల కేసులు పెండింగ్‌లో ఉండగా, వాటిలో 18 వేల కేసులకు హియరింగ్ పూర్తి చేసి, 16 వేల కేసుల్లో సమాచారం అందించామని వెల్లడించారు.పెండింగ్ కేసుల పరిష్కారం కోసం జిల్లాల పర్యటనలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media