వార్షిక వైద్య పరీక్షల కోసం అమెరికా పయనం
వరుస సినిమాలతో బిజీగా ఉన్న బాలీవుడ్ నటుడు
ఊపిరితిత్తుల క్యాన్సర్తో బాధపడిన బాలీవుడ్ నటుడు Sanjay Dutt పూర్తిగా కోలుకున్నట్లు తెలిసింది. అయినప్పటికీ ఆయన క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు.
ఈ ఏడాది హిందీ, తెలుగు, కన్నడ, మరాఠీ భాషల్లో ఆరు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉండటంతో సంజయ్ దత్ బిజీగా ఉన్నారు. దీంతో వార్షిక వైద్య పరీక్షలను కొంతకాలంగా వాయిదా వేస్తూ వచ్చారు.
అమెరికా వెళ్లే ముందు ఆయన మాట్లాడుతూ.. “ఇంకొన్ని సంవత్సరాలు పని చేయాలి. కుటుంబాన్ని చూసుకోవాలి. ఇప్పటివరకు ఎప్పుడూ లేనంతగా ఇప్పుడు నా పనిని ఆస్వాదిస్తున్నాను” అని చెప్పారు.
ఇదిలా ఉండగా సంజయ్ దత్ తాజా చిత్రం Aakhri Sawaal బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో స్పందన రాబట్టలేకపోయింది.

