సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి చరిత్ర సృష్టించారు. సింగపూర్ ఓపెన్ మెన్స్ డబుల్స్ టైటిల్‌ను కైవసం చేసుకున్న తొలి భారత ద్వయంగా నిలిచారు. ఇండోనేషియాకు చెందిన ఫజర్ అల్ఫియాన్, మహమ్మద్ షోహిబుల్ ఫిక్రీ జోడీపై విజయం సాధించారు. గంటా 13 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్ లో సాత్విక్-చిరాగ్ జోడీ 18-21, 21-17, 21-16 తేడాతో గెలుపొందింది.
2024లో థాయ్‌లాండ్ ఓపెన్ గెలిచిన తర్వాత, ఈ జంట ఏకంగా నాలుగు ఫైనల్స్‌లో ఓడి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఈ గెలుపు వారి కెరీర్‌లో తొమ్మిదో వరల్డ్ టూర్ టైటిల్ కాగా, మూడో సూపర్ 750 టైటిల్. ఈ టోర్నీ సెమీఫైనల్లో ప్రపంచ ఛాంపియన్లను ఓడించి ఫైనల్‌కు చేరింది.

