గోపినగర్‌లోని బీసీ బాలుర వసతి గృహం స్థలం కబ్జాల ముప్పులో ఉందని స్థానిక సంక్షేమ సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. గోపినగర్, బాపునగర్, నెహ్రూనగర్ ప్రాంతాల నివాసులు సంబంధిత అధికారులకు వినతిపత్రాలు సమర్పించి, స్థలాన్ని రక్షించాలని డిమాండ్ చేశారు.

డిప్యూటీ కలెక్టర్, తహసిల్దార్ మహిపాల్ రెడ్డి, జోనల్ కమిషనర్ హేమంత్ బోర్కడే, బీసీ డెవలప్మెంట్ అధికారి కేశురాం, కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్‌లకు సంఘ ప్రతినిధులు విజ్ఞప్తులు అందజేశారు.వసతి గృహం స్థాపనకు దశాబ్దాలు గడిచినా ప్రహరీ గోడ నిర్మించకపోవడం వల్ల ప్రాంగణం క్రమంగా కబ్జాలకు గురవుతోందని వారు పేర్కొన్నారు.అధికారులు తక్షణమే స్పందించి హాస్టల్ స్థలాన్ని పరిరక్షించేందుకు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

